మిధిలా స్టేడియంలో అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.