దసరా వేడుకలను దుకాణదారులు తమ మార్కెటింగ్ స్ట్రాటజీకి వాడేసుకుంటున్నారు. దసరా వేడుకల సందర్భంగా కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక లక్కీ డ్రాలు నడుపుతున్నారు. ఇందులో భాగంగా లక్కీ డ్రాలో గెలిస్తే కోళ్లు, దుస్తులు, మందు, బీర్లు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ లక్కీ డ్రా స్కీమ్లు కొనుగోలుదారులను కూడా ఆకట్టుకుంటున్నాయి. దీంతో దుకాణాలు కస్టమర్లతో కిక్కిరిసిపోతున్నాయి.