పండగొచ్చిందంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతా ఇంతాకాదు. మర్యాదలతో చుట్టాల్ని కట్టిపడేయటంలో గోదావరి జిల్లాలకు మించినవారు ఉండరంటే అతిశయోక్తికాదు. ఇక ఇంటికొచ్చిన కొత్తల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి.