సైబర్ మోసాలతో హడలిపోతున్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఓ మహిళ సంక్రాంతి ముగ్గుల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని గాంధీనగర్ కు చెందిన పబ్బతి నీతా రెడ్డి అనే మహిళ ప్రతి ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రజలను జాగృతం చేస్తూ తన ముగ్గుల రూపంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.