ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మార్క్ శంకర్ పెను ముప్పు నుంచి బయటపడటంతో తిరుమల శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నారు. తమ మొక్కు చెల్లించుకునేందుకు తిరుమల కొండెక్కి తలనీలాలు సమర్పించుకున్నారు.