నాంపల్లి కోర్టుకి హీరో నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నాగార్జున ఫ్యామిలీ వాంగ్మూలాన్ని నాంపల్లి కోర్ట్ రికార్డు చేసింది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా వేయడం తెలిసిందే. నాగార్జునతో పాటు మిగతా సాక్షుల స్టేట్మెంట్ను కోర్టు రికార్డ్ చేయనుంది.