ఆంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తికి పోలీసులు షాక్ ఇచ్చారు. కారు నడిపిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా.. రూ.2.50 లక్షల జరిమానా విధించారు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో నవంబర్ 7న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.