సిల్క్ స్మిత.. అలనాటి తెలుగు ప్రేక్షకులకు తన అందంతో చెమటలు పట్టించింది. ఏ సినిమాలో సిల్క్ స్మిత ఉంటే.. ఆ చిత్రం సూపర్ హిట్ అయినట్టే. 300కిపైగా చిత్రాల్లో నటించి.. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన స్టార్ నటీమణి ఈమె. ఎంతో డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఈ నటి.. చనిపోయే చివరి రోజుల్లో చాలా నరకం అనుభవించిందని అంటుంటారు.