హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. చాలా ఆనందకరమైన, చారిత్రక దినం అన్నారు.