దొంగలందు ఈ దొంగ వేరు. దొంగతనానికి వచ్చిన ఇంట్లో ఓ ముసలావిడ ఉంటున్నట్లు మనోడికి అర్థమయ్యింది. దీంతో ఇంట్లోని పాత బట్టలను ఉతికి ఆరబెట్టాడు. ఇంట్లోని చెత్తాచెదారాన్ని చూడ్చి సర్దిపెట్టాడు. ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఓ లేఖ కూడా రాసిపెట్టాడు. దీనిపై ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మంచి దొంగ భాగోతం బయటపడింది. ఈ ఘటన బ్రిటన్లో జరిగింది.