పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజ్ భవన్లో తన సొంత విగ్రహాన్ని ఆవిష్కరించడంపై వివాదం రాజుకుంది. పబ్లిసిటీ వ్యామోహం ఎక్కువై గవర్నర్ ఇలా తన సొంత విగ్రహాన్ని రాజ్ భవన్లో పెట్టుకున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకపడ్డాయి. అయితే ఇది ఓ కళాకారుడు బహుమతిగా ఇచ్చాడని.. దీన్ని గవర్నర్ తెరతీసి చూసుకున్నారని రాజ్ భవన్ అధికారులు వివరణ ఇచ్చారు.