పిఠాపురం పర్యటనలో రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి హోం మంత్రి అనిత బాధ్యత వహించాలన్నారు పవన్. లేదంటే తాను హోం శాఖ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తాను హోం మంత్రి అయితే విషయం ఇంకోలా ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు.