ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శాంతి భద్రతలు చాలా కీలకమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించొద్దని సూచించారు. ఇదే విషయాన్ని డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు, ఎస్పీలు, కలెక్టర్లకు చెబుతున్నట్లు చెప్పారు. తప్పు చేసిన వారిని తాను వెనకేసుకురావడం లేదన్నారు.