ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై పవన్ కల్యాణ్ ఏపీ కేబినెట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తాము, తమ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికకు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. పిల్లలపై కూడా అనుచిత కామెంట్స్ చేస్తున్నారని చెప్పారు. వీరిని ఉపేక్షించాలా అని ప్రశ్నించారు.