ఆధార్ అప్డేట్ పేరిట జరుగుతున్న భారీ మోసమిది. ఆధార్ కార్డులో పేరులో చిన్న అక్షరం తప్పున్నా.. దీన్ని సరిచేసేందుకు అక్కడి వారు రూ.5 వేల వరకు డిమాండ్ చేస్తున్నారాట. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆధార్ సెంటర్లలో నడుస్తున్న తంతు ఇది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఆధార్ కార్డులో అక్షరాన్ని సరిచేసేందుకు రూ.5 వేల ఇచ్చుకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.