ప్రముఖ సినీ నటి శ్రీరెడ్డిపై విశాఖ జిల్లాలో కేసు నమోదు అయ్యింది. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. టూ టౌన్ పీఎస్ లో తెలుగు మహిళల ఫిర్యాదుతో శ్రీ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 111(2)(b), 196(1), 353(2), 356(2), 61(2) 67 ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద FIR నమోదైంది.