ఏపీలో పెట్టుబడల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి వీలైనన్ని పరిశ్రమలు తీసుకురావాలన్న లక్ష్యంతో ఆయన టూర్ కొనసాగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో టాప్ కంపెనీల్లో ఒకటైన టెస్లా కంపెనీ ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు.