తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పరిసర ప్రాంతాలలో చిరుత యథేచ్చగా సంచరిస్తోంది. ప్రధాన లైబ్రరీ వెనుక భాగంలో రెండ్రోజుల క్రితం ఓ జింక పిల్లపై చిరుత దాడి చేసింది. అలాగే బుధవారంనాడు ఇంజనీరింగ్ కళాశాల సభ సమీపంలో ఒక తల్లి జింకపై దాడి చేసింది.