మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో వైసీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే వైసీపీ పెద్దలకు ఈ విషయం చెప్పానని వెల్లడించారు. రాపాక ప్రకటనతో కోనసీమ జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మలికిపురం జనసేన మీటింగ్లో ప్రత్యక్షమైన రాపాక.. జనసేన ఎమ్మెల్యేను కలిశారు. రాపాక త్వరలో టీడీపీలో చేరతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.