దువ్వాడ ఫ్యామిలీ వార్ కొండెక్కిందా? టెక్కలిలో ఇంటి పోరు ఇప్పటికే కోర్టుకెక్కింది. తాజాగా మాధురి సమేతంగా దువ్వాడ శ్రీను తిరుమలలో తళుక్కుమన్నారు. ఫోటోషూట్‌తో సందడి చేశారు . వాళ్లిద్దరు జంటగా కన్పించడంతో పెళ్లి చేసుకోవడానికే కొండకొచ్చారనే పుకార్లు షికారు చేశాయి. అయితే పెళ్లి చేసుకోవడానికే తిరుమలకు వచ్చామనే ప్రచారం నిజమే కానీ..ఆ ప్రచారంలో నిజంలేదన్నారు దువ్వాడ. ఇప్పుడు వచ్చింది అందుకు కాదన్నారు. భక్తితో బ్రహ్మోత్సవాలు చూడ్డానికి వచ్చామన్నారు. వాణితో దువ్వాడ శ్రీనివాస్ లొల్లి అందరికీ తెలిసిందే. మరి మాధురితో పెళ్లి ఎప్పుడు? దువ్వాడ శ్రీనివాస్ సమాధానం సాగదీసినా..మాధురి మాత్రం స్ట్రయిట్ అవేగా మ్యారేజ్ కీ బాత్ చెప్పేశారు. పెళ్లి పక్కా..డేట్ ఎప్పుడనేది త్వరలో చెప్తామన్నారు.