తమిళ నటుడు అజిత్ కు దుబాయ్ కారు రేస్‌లో తృటిలో ముప్పు తప్పింది. దుబాయ్ లో కారు రేస్ కోసం ప్రాక్టీస్ చేస్టుండగా అజిత్ నడుపుతున్న కారు గోడను ఢీ కొంది. గోడను ఢీ కొనడంతో ట్రాక్ పై అజిత్ కారు గిర్రున తిరిగింది. తక్షణమే స్పందించిన భద్రత సిబ్బంది.. ప్రమాదం జరిగిన స్పోర్ట్ కారులో నుంచి వేరే కారులోకి అజిత్‌ను తరలించారు.