రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం ప్రకటించడం తెలిసిందే. ఈ సొమ్మును తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఆ మేరకు అదానీ గ్రూప్ ఆఫ్ సంస్థలకు లేఖ రాసినట్లు తెలిపారు. ప్రస్తుతం అదానీ కంపెనీల చుట్టూ నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన ఢిల్లీ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టంచేశారు.