సినీ నటుడు సుమన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని "రియల్ హీరో" అని అభివర్ణించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీల మహా ధర్నాలో పాల్గొని, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని సుమన్ అన్నారు. ప్రధాని మోడీ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీలు రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతుగా ఉంటారని సుమన్ తెలిపారు.