ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోదరుడు నాగబాబుకు రాజ్యసభ సీటు కోసం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మంతనాలు చేశారని ఆరోపించారు. గతంలో చిరంజీవి కేంద్ర మంత్రి పదవి కోసం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో అలాగే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారికి కుటుంబ స్వార్థం తప్ప మరేదీ పట్టదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.