తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఏపీ సర్కార్ పోస్టింగ్ లు ఇచ్చింది. ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలికి పోస్టింగ్ ఇచ్చారు. టూరిజం అథారిటీ CEOగా కూడా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు తెలంగాణలోని హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమె కీలక బాధ్యతలు నిర్వర్తించారు.