ఇదొక ఇంట్రస్టింగ్ వార్త.. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇందులో ఉన్నది ఎవరో గుర్తుపట్టండి. గుర్తుపట్టారు కదా.. yes.. ఈయనే మాజీ మంత్రి కొడాలి నాని. చాలా కాలం తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆయన తలనీలాలు సమర్పించారు. ఎప్పుడూ గుబురుగడ్డంతో కనిపించే కొడాలి నాని.. ఇలా మొక్కు తర్వాత గుండుతో కనిపించారు. ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన వెంకన్న దర్శనం చేసుకున్నారు.