ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం నాడు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఢిల్లీ వెళతారు. గన్నవరం విమానాశ్రయం నుంచి 3.30 గంటలకు బయలుదేరుతారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశం అవుతారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్.. అమిత్ షాతో భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.