సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట - దంతాలపల్లి ప్రధాన రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ రహదారిపై అక్కడక్కడా ఏర్పడిన భారీ గుంతలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో రిక్షా కార్మికుడు స్వయంగా రంగంలోకి దిగి గుంతలు పూడ్చారు. ప్రతి ఒక్కరూ ఇలా బాధ్యతగా ఉంటే ఎందరో ప్రాణాలు నిలబడతాయని అంటున్నారు.