ఆస్తి కోసం బతికున్న తండ్రి చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాడు ఓ తనయుడు. ఆయన పేరిట ఉన్న ఇంటిని తన భార్య పేరు మీదకు మార్చుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు తనయుడు అశిబ్ నాయుడిని అదుపులోకి తీసుకున్నారు. తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఫేక్ సర్టిఫికెట్ పొందారని పంచాయితీ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై మరో కేసు నమోదయ్యింది.