అది విశాఖ రైల్వే స్టేషన్.. వచ్చే పోయే రైళ్లు, ప్రయాణీకులతో బిజీబిజీగా ఉంది. అదే సమయంలో నార్కోటిక్ టీమ్ జాగిలంతో తనిఖీలు చేస్తూ ఉన్నారు. రైల్వే ప్లాట్ఫామ్ పై వెళుతూ వెళుతూ.. ఆ పోలీసు జాగిలం ఒక్కసారిగా ఆగింది. ఎందుకు ఆగిందని అనుమానం వచ్చింది పోలీసులకు. ఎంతగా రమ్మన్నా ఆ జాగిలం అక్కడ నుంచి కదలడం లేదు.