కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుకు కారణమైన వీడియో ఇది. ఈ వీడియోను సుమోటో కింద పోలీసులు తీసుకున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును రిమాండ్ రిపోర్టులో చేర్చారు. ఈ వీడియో ఆధారంగానే కేటీఆర్ పేరును రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చినట్లు తెలుస్తోంది. నరేందర్ రెడ్డి మాట్లాడిన ఈ వీడియో ఆధారంగా మరికొంతమంది టీఆర్ఎస్ ముఖ్య నాయకులను ఈ కేసులో చేర్చనున్నారు పోలీసులు. జడ్చర్ల రైతుల కోసం అవసరమైతే టిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు వస్తామంటూ నరేందర్ రెడ్డి మాట్లాడారు. అవసరమైతే ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ నాయకులపై కలెక్టర్లపై దాడి చేస్తామంటూ రెండు రోజుల క్రితం నరేందర్ రెడ్డి హెచ్చరించారు.