భూవివాదంలో చనిపోయిన వ్యక్తిపై స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల తీరుపై తండావాసులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ శివారు లచ్చిరాం తండాకు చెందిన పాత్లోత్ విఠల్ అనే వ్యక్తి ఏడుళ్ల క్రితం మృతి చెందాడు. అయితే ఎలాంటి విచారణ చేపట్టకుండానే భూ వివాదం కేసులో ఆయన్ను ఏ4గా చేర్చారు పోలీసులు.