కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం గాంధీనగర్లో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. వృద్ధురాలిపై దాడి చేసి నాలుగు తులాల బంగారు కొలుసు ఎత్తుకొని పారిపోయేందుకు యత్నించాడు దొంగ. ఆ సమయంలో కళ్ళు తిరిగి మెట్లపై నుండి కిందపడి స్పృహతప్పి పోయాడు.