నగర పోలీసులు మంగళవారంనాడు నిర్వహించిన డ్రైవ్‌లో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లోని గేట్ నంబర్ 1 సమీపంలో శిక్షణ పొందిన నార్కోటిక్ జాగిలం 30 కిలోల గంజాయిని గుర్తించింది. ఉత్తరాంధ్రలో గంజాయి రవాణాను అరికట్టేందుకు నగర టాస్క్‌ఫోర్స్, ఐవీ టౌన్ పోలీసులు, డాగ్ స్క్వాడ్‌తో కలిసి రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు.