ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది పూర్తిగా పనికిమాలిన కేసు అంటూ అసహనం వ్యక్తం చేసింది. చంద్రబాబుపై ఉన్న ఏడు కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇది పూర్తిస్థాయిలో తప్పుడు పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.