ప్రేమ జంటలకు ఆ పార్క్‌లోకి ప్రవేశం లేదు. అవును.. ఇది వాస్తవం. ఖమ్మంలోని తెలంగాణ ఫ్రీడం పార్క్‌లోకి ప్రేమ జంటలను అనుమతించడం లేదు. లవర్స్‌కి అనుమతి లేదంటూ పార్క్ బయట బోర్డ్ కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళ పార్క్‌లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.