సఫాయ్ కార్మికులు ఆందోళన చేస్తే ఎలా ఉంటుందో మరో సారి తెలిసేలా చేశారు. తమకు చెల్లించాల్సిన వేతనాలు ఇవ్వడం లేదంటూ మున్సిపల్ సిబ్బంది.. గ్రామ సచివాలయం ఎదుట చెత్తను పోరబోశారు. ఏలూరు జిల్లా జాలిపూడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సఫాయ్ కార్మికురాలు ఇలా వినూత్న నిరసనతో షాక్ ఇచ్చింది. ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా సతాయిస్తున్నారని ఆమె మండిపడింది.