శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. బాల రామూడి నుదుటిపై సూర్యుడు తన కిరణాలతో తిలకాన్ని దిద్దే అద్భుత ఘట్టం భక్తులని పులకింప చేసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాలరామూడి నుదుటిపై న తెల్లని సూర్యకిరణాలు ప్రసరించాయి.