హైదరాబాద్ మియాపూర్‌లో చిరుత సంచరిస్తుందన్న సమాచారం కలకలం రేపింది. మెట్రో స్టేషన్ సమీపంలో కదలికలు స్థానికులను హడలెత్తించాయి. రాత్రంతా ఒకటే టెన్షన్. హుటాహుటిన పోలీసులు రంగంలోకి దిగారు. అటవీ శాఖ సిబ్బంది స్పాట్‌కు చేరుకున్నారు. ఉత్కంఠకు తెరదించారు. కదలికలను బట్టి అడవి పిల్లిగా తేల్చిన అటవీ శాఖ అధికారులు. ఈ ప్రకటనతో ఊపిరిపీల్చుకున్నారు స్థానికులు