అదృష్టం లాటరీ రూపంలో ప్లంబర్ తలుపుతట్టింది. రాత్రికి రాత్రి అతని దశ తిరిగిపోయింది. లాటరీలో ఏకంగా రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు హర్యానాలోని సిర్సాకు చెందిన ప్లంబర్ మంగళ్. ఈ సొమ్ముతో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవడంతో పాటు కుమార్తె భవిష్యత్తుకు ప్లాన్ చేస్తానని వెల్లడించాడు. లాటరీ గెలిచామని తెలియడంతో మంగళ్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.