అమరావతి డ్రోన్ షోలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. షోలో భాగంగా కొందరు కళాకారులు సైకిల్ స్టంట్ ప్రదర్శించారు. దీన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తిగా తిలకించారు. క్లాప్స్ కొడుతూ కళాకారులను ప్రోత్సహించారు. చంద్రబాబు నాయుడు ఈ సైకిల్ స్టంట్‌ను ఆద్యంతం ఎంజాయ్ చేస్తూ గడిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.