పుష్ప 2 హీరో అల్లు అర్జున్ తన మామయ్య నాగబాబును హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. అల్లు అర్జున్ వెంట ఆయన సతీమణి స్నేహా రెడ్డి కూడా ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని నాగబాబు నివాసంలో దాదాపు అర గంటకు పైగా ఈ భేటీ జరిగింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో శుక్రవారం అరెస్టైన అల్లు అర్జున్.. ఆ రోజు రాత్రి చంచల్ గూడ జైల్లోనే గడిపారు.