తనపై ఏసీబీ కేసు నమోదు కావడంపై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని ఆమె ఆరోపించారు. ఈ కేసు వెనుక టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు ఉన్నారని ఆరోపించారు.