తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి పదవులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పదవులు శాశ్వితం కాదని.. నాయకుల పేర్లే శాశ్వితమన్నారు. ఓ కార్యక్రమంలో నిర్వాహకులు తనను మాజీ ఎమ్మెల్యే అని సంబోధించడంపై స్పందిస్తూ జగ్గా రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.