మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తమ వింత హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. శరత్ పవార్ వర్గం ఎన్సీపీకి చెందిన రాజా సాబ్ ఈ రకమైన వెరైటీ హామీ ఇచ్చారు ఓటర్లకు. చాలా మంది యువకులు తమకు ఇంకా పెళ్లి కావడం లేదని తమ సమస్యను ఏకరువు పెట్టగా.. ఎన్నికల్లో గెలిస్తే ఆ బాధ్యత తాను తీసుకుంటానంటూ ఆయన హామీ ఇచ్చేశారు.