డ్రోన్ టెక్నాలజీ వాడకంలో ఏపీ పోలీసులు ముందంజలో ఉన్నారు. మెడిసిన్స్ సరఫరా వాటికే కాదు.. ట్రాఫిక్ నియంత్రణకు కూడా డ్రోన్ టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఎక్కడైనా వాహనాల ట్రాఫిక్ ఏర్పడినప్పుడు.. డ్రోన్‌ను పంపి అక్కడ ట్రాఫిక్ నియంత్రణ చేపడుతున్నారు పోలీసులు. డ్రోన్ టెక్నాలజీ వాడకం ఇలా రోజురోజుకూ పెరుగుతోంది.