మాజీ మంత్రి మల్లారెడ్డి తన డాన్స్ తో అదరగొట్టారు. 75 ఏళ్ల వయసులో ఆయన స్టేజ్ పై బ్రేక్ డాన్స్ వేసి వారెవ్వా అనిపించారు. మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈనెల 27న జరగనుంది. అందులో భాగంగా ఆదివారం రాత్రి సంగీత్ కార్యక్రమం జరిగింది. సంగీత్ కార్యక్రమంలో మల్లారెడ్డి స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. మంచి కాస్ట్యూమ్ తో, మనవళ్లను పక్కన పెట్టుకొని... కొరియోగ్రాఫర్లతో కలిసి స్టెప్పులు వేశారు.