నిర్మల్ ప్రభుత్వాస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో ఊపిరి ఆడక రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అయ్యారు. హుటాహుటిన వార్డులోని రోగులను బయటకు పంపారు. మంటలు చూసి భయపడి రోగులు, బంధువులు అంతా పరుగులు తీశారు. ఆస్పత్రిలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఆస్పత్రి వద్దకు చేరుకున్న ఫైరింజన్లు మంటలను ఆర్పేశాయి. అగ్ని ప్రమాదం కారణంగా ఆరు బయట చెట్లకిందే రోగులు, వారి బంధువులు ఉండాల్సి వచ్చింది.