01 December 2025

ఇంటిలో గోడలపై బల్లులు ఉండటం మంచిదేనా?

samatha

Pic credit - Instagram

ఇంటిలోపల బొద్దింకలు, చీమలు బల్లులు ఉండటం కామన్. ముఖ్యంగా చాలా ఇళ్లల్లో బల్లులు ఉంటాయి. కానీ ఇవి ఉండటం కొందరికి అస్సలే ఇష్టం ఉండదు.

కొంత మంది  వాటిని ఇంటి నుంచి తరిమి కొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకొంత మంది మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేస్తారు.

కానీ జ్యోతిష్యశాస్త్రంలో బల్లుల గురించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. కొందరు బల్లిని చూడటం మంచిదంటారు. మరి ఇంటిలో బల్లి ఉండటం మంచిదేనా కాదా తెలుసుకుందాం.

చాలా మంది బల్లులను చూడగానే భయపడి పోతుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇంటిలో బల్లులు ఉండటం శుభ ప్రదం, ఇవి లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటాయంట.

కొన్ని రాష్ట్రాల్లో బల్లులను పూజిస్తారు. ఇంటిలో బల్లి విగ్రహాలను ఉంచుకుంటారు. ఎందుకంటే, ఇవి ఇంటిలో ఆనందం, సంపదకు కారణం అవుతాయని వారి నమ్మకం.

ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పూజ గదిలో లేదా రిసెప్షన్ గదిలో బల్లులను చూడటం చాలా శుభప్రదం. ఇది మీకు రాబోయే సంపదను సూచిస్తుందంట.

అలాగే దీపావళి రోజున ఇంటిలో బల్లి ఉంటే, ఆ ఏడాది మొత్తం మీకు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయంట. మీకు అపారమైన సంపద కలుగుతుందంట.

ఇంటిలోపల ఒకే చోట మూడు బల్లులను చూడటం చాలా శుభప్రద. ఇది మీకు శుభ వార్తను తీసుకొస్తుందని చెబుతున్నారు నిపుణులు.