ధను సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. మకర సంక్రాంతికి నెల రోజుల ముందు వచ్చే ధను సంక్రాంతి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
ఈ పండుగను డిసెంబర్ 16న భక్తులు అందరూ ఘనంగా జరుపుకుంటారు. ఇది చాలా ప్రత్యేకమైన పండుగ.
సూర్యుడు ధనస్సు రాశిలోకి సంచారం చేసే సమయాన్ని ఇది సూచిస్తుంది. ఈ పండుగ రోజు భక్తులందరూ ఉదయాన్నే తల స్నానం చేసి, సూర్యుడికి నీళ్లు అర్పించి, ఆశీర్వాదం పొందుతారు
ఒడిశా, తూర్పు భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు ఉదయాన్నే జగన్నాథ ఆలయాలకు భక్తులు తరలి వెళ్లి, ప్రత్యేక పూజలు చేస్తారు.
అయితే ఈ ధను సంక్రాంతి రోజూ కొన్ని వస్తువులు దానం చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. కాగా, ఏ వస్తువులు దానం చేయాలో చూద్దాం.
జీవితంలో పదే పదే విఫలం అయ్యే వారు ఈ రోజు కొబ్బరికాయ దానం చేయడం వలన అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయంట.
అదే విధంగా ధను సంక్రాంతి రోజున ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వలన మీరు చేసే పనిలో మంచి పురోగతి ఉంటుందంట.
అయితే ధను సంక్రాంతి రోజు ఏవైనా దానం చేసే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా చేయడం మంచిదంట.